అనధికార ఫ్లెక్సీలు పెడితే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

అనధికార ఫ్లెక్సీలు పెడితే కఠిన చర్యలు

Oct 17 2026 12:58 AM | Updated on Oct 17 2026 12:58 AM

● బల్దియా కమిషనర్‌ వెంకన్న

వరంగల్‌ అర్బన్‌: నగరవ్యాప్తంగా అనధికారికంగా బిల్‌బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బిల్‌బోర్డులను తొలగించినట్లు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పండుగల సందర్భంగా నగరానికి వచ్చే ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని, ప్రధాన రహదారులు, కూడళ్లు, చెరువుల పరిసరాలు, ఉత్సవ ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

వేడుకలకు సర్వం సిద్ధం చేయాలి..

శుక్రవారం ఉదయం హసన్‌న్‌పర్తి, భీమారం, వడ్డేపల్లి, బంధం చెరువు, పద్మాక్షి గుట్ట, పరిసరాలు, వరంగల్‌లోని ఉర్సు గుట్ట ప్రాంతాల్లో రంగలీల మైదానం తదితర ప్రధాన బతుకమ్మ, దసరా ఉత్సవ ప్రాంగణాలను కమిషనర్‌ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్‌ పనులు, మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లు పరిశీలించారు. కమిషనర్‌ వెంట సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ రాజ్‌కుమార్‌, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు సంజయ్‌కుమార్‌, మాధవీలత, మహేందర్‌, రవికుమార్‌తో పాటు ఇంజనీరింగ్‌, పారిశుద్ధ్య, టౌ న్‌ ప్లానింగ్‌ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement