వరంగల్ స్పోర్ట్స్: ఎస్జీఎఫ్ఐ అండర్–19 జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పుల్లూరి లక్ష్మీ శార్వాణి ఎంపికై ంది. ఈ నెల 15న హైదరాబాద్లోని హయత్నగర్లో జరిగిన రాష్ట్రస్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ చెస్ పోటీల్లో రెండో స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ నెల 5న హనుమకొండలోని జేఎన్ఎస్లో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన ఆమె రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఢిల్లీలో ఈ నెల 23 నుంచి 28 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొననుంది. లక్ష్మీ శార్వాణి వడ్డేపల్లిలోని ఎస్ఆర్ ఎడ్యూ సెంటర్లో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె విజయంపై ఎస్ఆర్ కాలేజీల అధినేత వరదారెడ్డి అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.


