నియామకం | - | Sakshi
Sakshi News home page

నియామకం

Oct 17 2026 12:58 AM | Updated on Oct 17 2026 12:58 AM

ఖిలా వరంగల్‌: తెలంగాణ ఎంప్లాయీస్‌ జేఏసీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా చైర్మన్‌గా ఖిలావరంగల్‌ తహసీల్దార్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ ఏకగ్రీవంగా నియమితులయ్యారు. శుక్రవారం వరంగల్‌లో జరిగిన సమావేశంలో ఇక్బాల్‌ను నియమించినట్లు జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ లక్కిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కుష్టు వ్యాధి గుర్తింపునకు ప్రత్యేక సర్వే

హన్మకొండ అర్బన్‌: జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 22 నుంచి నవంబర్‌ 4వ తేదీ వరకు నిర్వహించే ఇంటింటి సర్వేను విజయవంతం చేయాలని రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్‌ విజయ నిర్మల కోరారు. హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ప్రోగ్రాం మేనేజ్‌మెంట్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే చేయాలని, వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అఽ దికారి డాక్టర్‌ అప్పయ్య, డాక్టర్‌ టి.మదన్‌మోహన్‌రావు, డాక్టర్‌ ప్రదీప్‌రెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

కుష్ఠు లక్షణాలను గుర్తించాలి

● వరంగల్‌ డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి

గీసుకొండ: కుష్ఠు వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, పూర్తిస్థాయి చికిత్స తీసుకుంటే వ్యాధిని నయం చేయవచ్చని వరంగల్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.రాజారెడ్డి తెలిపారు. జాతీయ కుష్ఠు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో శుక్రవారం పుఃనశ్చరణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ఈనెల 22 నుంచి నవంబర్‌ 4 వరకు జిల్లాలో ఇంటింటి కుష్ఠు వ్యాధి గుర్తింపు కార్యక్రమం (ఎల్‌సీడీసీ) నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, డీఐఓ డాక్టర్‌ ఐ.ప్రకాశ్‌, ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ ఇక్తిదార్‌ అహ్మద్‌, డాక్టర్‌ అరుణ్‌ జోషి, లెప్రసీ విభాగం మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మానస, డిప్యూటీ పారామెడికల్‌ అధికారి వెంకన్న, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు, నోడల్‌ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement