ములుగు: ములుగు మున్సిపాలిటీ పరిధిలో నూతన బార్ అండ్ రెస్టారెంట్ లక్కీ డ్రాలో ఓ టీ స్టాల్ నిర్వాహకుడికి అదృష్టం వరించింది. శుక్రవా రం ములుగు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పర్యవేక్షణలో లక్కీ డ్రా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 41 బార్ల ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా, అందులో ములుగు ము న్సిపాలిటీ పరిధిలో ఒక బార్కు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి మొత్తం 376 దరఖాస్తులు అందాయి. వీటికి నిర్వహించిన లక్కీ డ్రాలో 349 టోకెన్ నంబర్ గల దరఖాస్తుదారుడు వెంకటేశ్ బార్ అండ్ రెస్టారెంట్ కేటాయింపునకు ఎంపికయ్యారు. హనుమకొండ బస్టాండ్లో టీ స్టాల్ నిర్వహించే వెంకటేష్ కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే చేశారు. ఆయనకు లాటరీలో లైసెన్స్ రావడం విశేషం. చాయ్ వాలా.. ఇప్పుడు బార్ ఓనర్ కాగా, నక్క తోక తొక్కడం అంటే ఇదేనేమో అని పలువురు పేర్కొంటున్నారు.
లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన
కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు


