● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నర్సంపేట: దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శుక్రవారం నర్సంపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేట నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని పెద్ది సుదర్శన్‌రెడ్డి చేయాలనుకున్న అభివృద్ధిని దగ్గరుండి చేయిస్తానని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా పెద్ది స్వప్నతోపాటు జిల్లా, రాష్ట్ర నాయకత్వం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ఆస్పత్రికి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడతామని తెలిపారు. నర్సంపేటలో పార్టీ నాయకులందరూ ఐక్యంగా కలిసి కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. ఒక పార్టీ నాయకుడు మృతి చెందితే ఆయన కుటుంబానికి అండగా ఉండడతోపాటు వారిని గుండెల్లో పెట్టుకుని చూసే ఏకై క పార్టీ బీఆర్ఎస్ పార్టీనేనని అన్నారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు.


