రాష్ట్రస్థాయి మినీ సాఫ్ట్‌బాల్‌ పోటీలు షురూ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి మినీ సాఫ్ట్‌బాల్‌ పోటీలు షురూ

Oct 17 2026 12:58 AM | Updated on Oct 17 2026 12:58 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌ : హనుమకొండ జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వరంగల్‌లోని ఎల్‌బీ కళాశాల క్రీడా మైదానంలో రాష్ట్రస్థాయి మినీ సబ్‌జూనియర్‌ బాలుర సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ పిల్లి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవానికి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ప్రశాంత్‌, ఇండియా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ శోభ బాబు, రాష్ట్ర కార్యదర్శి నవీన్‌కుమార్‌, అంతర్జాతీ య క్రీడాకారుడు అభిషేక్‌గౌడ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ ప్రశాంత్‌ మాట్లాడుతూ.. సాఫ్ట్‌బాల్‌ క్రీడాభివృద్ధికి సహకరి స్తానని తెలిపారు. క్రీడాకారులు అసోసియేషన్‌ సేవలను వినియోగించుకుని జాతీయస్థాయిలో రాణించాలని శోభన్‌ బాబు సూచించారు. రెండు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో రాష్ట్రంలోని 21 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు జిల్లా అసోసియేషన్‌ కార్యదర్శి తాబేటి రాజేందర్‌ తె లిపారు. కార్యక్రమానికి గ్రేటర్‌ వరంగల్‌ మున్సి పల్‌ కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ ఈసంపల్లి జో నా, డిప్యూటీ కమిషనర్‌ ప్రసన్నరాణి హాజరుకాగా అసోసియేషన్‌ ప్రతినిధులు వారిని సన్మానించారు. హనుమకొండ జిల్లా జట్టు క్రీడాకారులకు ఫిజికల్‌ డైరెక్టర్లు సృజన, సుష్మ క్రీడా దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో పలు జిల్లాల సాఫ్ట్‌ బాల్‌ అసోసియేషన్‌ సెక్రెటరీలు, కోచ్‌లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, సీని యర్‌ క్రీడాకారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement