కాళోజీ సెంటర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్ష ఫీజుల విషయంలో విద్యార్థులనుంచి అదనంగా ఫీజులు వసూలు చేసిన ఆరోపణలపై వరంగల్ మట్టెవాడ జీహెచ్‌ఎస్ స్కూల్ అసిస్టెంట్ వి.అజయ్‌బాబును డీఈఓ బి.రంగయ్యనాయుడు సస్పెండ్ చేశారు. ‘ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ల మాయాజాలం’ శీర్షికన సాక్షిలో ఆగస్టు 22న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి విచారణ చేపట్టారు. 12మంది విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఫీజులను సొసైటీకి జమ చేయలేదని తెలిపారు. దీంతో వారు పరీక్షలకు హాజరుకాలేక ఒక విద్యా సంవత్సరం కోల్పోయినట్లు విచారణలో వెల్లడైందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కొనసాగుతోందని, తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఈఓ పేర్కొన్నారు.


