హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని విజయ టాకీస్ ఎదుట గల ప్రపంచ పేరెన్నిక గల జోయాలుక్కాస్ జ్యువెలరీ షోరూంలో శుక్రవారం ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో’ ప్రారంభమైంది. ఈ షో తెలంగాణను మెరిపించనుంది. ఈ ప్రదర్శనలో వజ్రాభరణాలలో నైపుణ్యం, సొబగులు, సరికొత్త ఆవిష్కరణల అపురూప వేడుకను అందిస్తుందని యాజమాన్యం వెల్లడించింది. పెళ్లిళ్లకు అద్భుత నగల సెట్‌ల నుంచి నిత్యం ధరించే ఆధునిక ఆభరణాల వరకు ఈ ప్రదర్శనలో కాలాతీతమైన సంప్రదాయం, ఆధునికత కలగలిసిన ఆభరణాలు లభ్యమవుతాయని తెలిపారు. ప్రతీ డిజైన్ ఓ కళాఖండమని, ఇది ఈ షో జరిగే పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జోయ్ అలుక్కాస్ వెల్లడించారు. ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో వజ్రాల శాశ్వతమైన ఆకర్షణ, ఆభరణాల రూపకల్పనలో తమ పరిపూర్ణతకు నిదర్శనమన్నారు. తెలంగాణ తమ ప్రయాణంలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. ప్రదర్శన సమయంలో రూ.లక్ష అంతకంటే ఎక్కువ విలువైన వజ్రాభరణాలు కొనుగోలు చేసిన ప్రతీ వినియోగదారుడికి ఒక ఉచిత బంగారు నాణెం అందిస్తున్నట్లు, ఇది షాపింగ్ అనుభవానికి మరింత మెరుపును జోడిస్తుందన్నారు. అత్యంత ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో’ ఈ నెల 18 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.


