హసన్‌పర్తి/కాశిబుగ్గ/కాజీపేట/ఖిలావరంగల్/కాజీపేట అర్బన్: : గాంధీ జయంతి రోజు మద్యం విక్రయాలు బంద్ చేసిన నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ పరిధిలో బెల్ట్‌షాపుల దందా జోరుగా సాగింది. కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిఽధిలోని వివేకనగర్‌కాలనీలో ఓ మహిళ మద్యం విక్రయాలు చేపడుతున్నారనే పక్క సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా సుమారు రూ.1,12,410 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. అదేవిధంగా గణేష్ నగర్‌లో రాజు అనే యువకుడు నిర్వహిస్తున్న బెల్ట్‌షాపుపై దాడులు చేసి రూ.10వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మద్యాన్ని సీజ్ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
● కాజీపేట వడ్డెర కాలనీలో ఓ మహిళ, సోమిడి రోడ్డులో సురేందర్‌లు నడిపిస్తున్న బెల్ట్‌షాపులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి రూ.20 వేల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్ సుబ్బారెడ్డి, ఎస్సై ఉప్పలయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
● మడికొండలోని స్వామి క్యాంటీన్‌పై దాడి చేసి రూ.33,800 విలువగల మద్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు పల్లపు శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా కెనరా బ్యాంకు ఎదురుగా గల బెల్ట్‌షాపుపై మడికొండ పోలీసులు దాడి చేసి రూ.7,500 విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు పల్లపు యాదగిరిపై కేసు నమోదు చేశారు.
వరంగల్ పరిధిలో
● వరంగల్ తుమ్మలకుంట, ఆటోనగర్ ప్రాంతాల్లో అక్రమంగా ఐఎంఎఫ్‌ఎల్ బీర్లు విక్రయిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఓ మహిళను అరెస్టు చేసి, ఆమె వద్ద ఉన్న రూ.13,480 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆదేశాల మేరకు ఈ దాడిలో సీఐ వి.క్రాంతికుమార్, ఎస్‌ఐ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
● వరంగల్ సాకరాశికుంటలోని ఎనుగందుల రవి, ఓ మహిళ వేర్వేరుగా తమ ఇళ్లలో మద్యం విక్రయాలు జరుపుతుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. రూ.60,640 విలువైన మద్యం సీజ్ చేశారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి తదిపరి చర్యల నిమిత్తం మిల్స్‌కాలనీ పోలీసులకు కేసును అప్పగించనట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజు తెలిపారు. తనిఖీల్లో ఆర్‌ఎస్సై భాను ప్రకాశ్, సిబ్బంది సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.
చికెన్ వంట
భీమారంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల నిర్వాహకులు శుక్రవారం స్థానిక ఓ ఫంక్షన్ హాల్‌లో విద్యార్థులకు ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంకింద చికెన్ బిర్యాని తయారు చేయించగా అధికారులకు సమాచారం అందింది. అప్రమత్తమైన కళాశాల నిర్వాహకులు చికెన్ వంటకాలను మరో ప్రాంతానికి తరలించి వండించినట్లు సమాచారం. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.
భారీగా మద్యం స్వాధీనం


