ఓసీ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఓసీ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ డిమాండ్‌

హన్మకొండ అర్బన్‌: రామప్ప ప్రపంచ వారసత్వ ప్రదేశం, రామప్ప చెరువు, పరిసర పర్యావరణానికి ముప్పు కలిగించే వెంకటాపూర్‌ పీవీ నరసింహారావు ఓపెన్‌న్‌కాస్ట్‌ గని ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ డిమాండ్‌ చేసింది. సోమవారం హనుమకొండ ప్రగతినగర్‌లోని ట్రస్ట్‌ కార్యాలయంలో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఎం. పాండురంగారావు అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మేయర్‌ డాక్టర్‌ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు హాజరై మాట్లాడుతూ రామప్ప దేవాలయం, చెరువు, పరిసర సహజ, జల, భౌగోళిక వ్యవస్థలను సమగ్రంగా పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపాదిత గనిపై నిర్ణయం తీసుకునే ముందు సమగ్రంగా అధ్యయనాలు నిర్వహించాలని కోరారు. ప్రతిపాదిత గనిలో 300 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిగే అవకాశం ఉన్నందున భూగర్భ జల ప్రవాహం, రామప్ప చెరువు నీటి మట్టం, కట్ట భద్రతపై అధ్యయనం చేయాలని నిపుణులు సూచించారు. యునైటెడ్‌ ఫోరం ఫర్‌ ఎన్విరాన్‌న్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ అధ్యక్షుడు కాజీపేట పురుషోత్తం, ప్రొఫెసర్‌ లక్ష్మారెడ్డి, ధర్మప్రకాశ్‌, ప్రొఫెసర్‌ శ్రీనివాసాచార్యులు, వాటర్‌మ్యాన్‌ వి.ప్రకాష్‌, రామ్‌మోఆన్‌రావు, జె.శ్రీధర్‌రావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement