శ్వేతార్క గణపతికి పూజలు | - | Sakshi
Sakshi News home page

శ్వేతార్క గణపతికి పూజలు

Sep 21 2026 7:17 AM | Updated on Sep 21 2026 7:17 AM

శ్వేతార్క గణపతికి పూజలు నేడు గ్రేటర్‌ గ్రీవెన్స్‌ వరంగల్‌ జిల్లాకు ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ రెటీనా సర్జికల్‌ సర్క్యూట్‌ కాన్ఫరెన్స్‌కు డాక్టర్‌ శ్రీకుమార్‌ హోరాహోరీగా సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలు లక్నవరంలో సందడి

హన్మకొండ కల్చరల్‌: రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఉత్తిష్ట గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏడో రోజు ఆదివారం మూలమహాగణపతిని శ్రీశ్వేతార్క గణపతిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, అర్చకుడు ప్రణవ్‌ ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాలకు చందుపట్ల సత్యపాల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, గుజ్జ సంపత్‌రావు, ప్రభాకర్‌ గౌడ్‌ ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈఓ అనిల్‌కుమార్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహానగర పాలకసంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ టి.వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

వరంగల్‌ కలెక్టరేట్‌లో..

న్యూశాయంపేట: వరంగల్‌ కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని రెవెన్యూ డివిజన్‌, ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటలకు గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

న్యూశాయంపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వరంగల్‌ జిల్లాలో ఈనెల 21, 22, 23, 24 తేదీల్లో నాలుగు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం అధికారులు ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. నేడు, రేపు జిల్లావ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు, 23, 24 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

కాశిబుగ్గ: బెంగళూరులో జరిగిన రెటీనా సర్జికల్‌ సర్క్యూట్‌ కాన్ఫరెన్స్‌కు వరంగల్‌ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ప్రొఫెసర్‌, డాక్టర్‌ వగ్జె శ్రీకుమార్‌ వెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా లీడింగ్‌లో ఉన్న పది కంపెనీలు కలిసి ఏర్పాటు చేసిన మూడు రోజుల కాన్ఫరెన్స్‌లో డాకర్‌ శ్రీకుమార్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన లూమినా రెటినా–26 కాన్ఫరెన్స్‌లో ఆధునాతన సర్జికల్‌ రెటీ నా విధానాలు, శస్త్ర చికిత్సలపై ప్రధానంగా దృష్టి సాధించి, వ్యవహరించే తీరుపై ఆయన తర్ఫీదు పొందారు.

కమ్మర్‌పల్లి: నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని గ్రీన్‌ఫీల్డ్‌ మినీ స్టేడియంలో 11వ తెలంగాణ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ బాలికల టోర్నీ పోటీలు హోరా హోరీగా జరిగాయి. ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జట్లు తలపడగా.. 09–03 తేడాతో నిజామాబాద్‌ జట్టు ఘన విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. మూడోస్థానం కోసం జరిగి న మ్యాచ్‌లో వరంగల్‌ జట్టు నల్లగొండ జట్టుపై 5–0 తేడాతో విజయం సాధించింది. పోటీలలో ప్రతిభ చూపినవారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. వారి కమ్మర్‌పల్లి మినీ స్టేడియంలో ఐదురోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు.

గోవిందరావుపేట: మండల పరిధిలోని లక్నవరంలో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సందర్శకులు సరస్సు అందాలను వీక్షించారు. అనంతరం బోటు షికారుతో పాటు జిప్‌ లైన్‌పై సైక్లింగ్‌ చేస్తూ ఉత్సాహంగా గడిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement