ఉనికిచర్ల టు భీమారం | - | Sakshi
Sakshi News home page

ఉనికిచర్ల టు భీమారం

Sep 21 2026 7:17 AM | Updated on Sep 21 2026 7:17 AM

హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలం భీమారం శివారులో స్పోర్ట్స్‌ స్కూల్‌ కోసం భూమిని గుర్తించారు. ఇప్పటికే ఈ భూమి సర్వే నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఆమోదం వచ్చాక పనులు చేపట్టనున్నారు. ఏడాది క్రితం వరంగల్‌కు స్పోర్ట్స్‌ స్కూల్‌తోపాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా మైదానాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని ఉనికిచర్లలో (జాతీయ రహదారికి పక్కనే) భూమిని అధికారులు గుర్తించారు. స్టేషన్‌ ఘన్‌పురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం తన నియోజకవర్గంలోనే స్పోర్ట్స్‌ స్కూల్‌ నిర్మించాలని పట్టుబట్టారు. ఉనికిచర్లలోని సర్వే నంబర్‌ 325లో సుమారు 30 ఎకరాల భూమిని స్పోర్ట్స్‌ స్కూల్‌, స్డేడియానికి సేకరించాలని అధికారులు నిర్ణయించారు. సేకరించే క్రమంలో అక్కడ భూమి వివాదంగా మారింది. దీంతో ఈ స్కూల్‌ను భీమారానికి షిఫ్ట్‌ చేశారు. భీమారంలోని సర్వే నంబర్‌ 70లో సుమారు 22 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి అందించారు.

కలెక్టర్‌ పరిశీలన

కాగా, స్పోర్ట్స్‌ కోసం భీమారం శివారులో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని ఇటీవల హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ పరిశీలించారు. సుమారు 35 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్న ఈభుమిలో కస్తూర్బా గాంధీ విద్యాలయం, ఎస్టీ మహిళా హాస్టల్‌తో పాటు చేపల ఉత్పిత్తి కేంద్రం ఉన్నట్లు కలెక్టర్‌కు వివరించారు. ప్రభుత్వం 22 ఎకరాల అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఇటు 563 జాతీయ రహదారి, అటూ 163 జాతీయ రహదారికి అనుకుని ఈ ప్రతిపాదిత స్థలం ఉన్నట్లు కలెక్టర్‌కు తెలిపారు.

నిధులు మంజూరు..

స్పోర్ట్స్‌ స్కూల్‌ నిర్మాణానికి రూ.150 కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభం కాకపోవడం వల్ల స్పోర్ట్స్‌ స్కూల్‌ తరగతులు జవహర్‌లాల్‌ నెహ్రూ స్డేడియం భవనంలో తాత్కాలికంగా ప్రారంభించారు.

స్పోర్ట్స్‌ స్కూల్‌ తరలింపు

22 ఎకరాల భూమి గుర్తింపు

రూ.150 కోట్లు మంజూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement