స్క్రీనింగ్‌ టెస్ట్‌కు మిశ్రమ స్పందన | - | Sakshi
Sakshi News home page

స్క్రీనింగ్‌ టెస్ట్‌కు మిశ్రమ స్పందన

Sep 21 2026 7:17 AM | Updated on Sep 21 2026 7:17 AM

స్క్రీనింగ్‌ టెస్ట్‌కు మిశ్రమ స్పందన

హసన్‌పర్తి: ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగార్థుల కోసం ఆదివారం నిర్వహించిన స్క్రీనింగ్‌ టెస్ట్‌కు మిశ్రమ స్పందన లభించింది. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధి సీకేఎం కళాశాల, హనుమకొండలోని ఎస్‌వీఎస్‌ కళాశాల, జనగామలోని సీజేఐటీ ఇంజనీరింగ్‌ కళాశాల(యశ్వంతపురం రోడ్‌), పరకాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నర్సంపేటలోని బిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థులు స్క్రీనింగ్‌ టెస్ట్‌ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. మొత్తం 1,966 మంది పేర్లు నమోదు చేసుకుంటే 975 మంది మాత్రమే పరీక్షకు (54.7 శాతం) హాజరయ్యారు. కాగా, పరీక్ష కేంద్రాలను పోలీస్‌ కమిషనర్‌ శ్వేతతో పాటు డీసీపీలు పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు.

కోటను సందర్శించిన సీపీ

ఖిలా వరంగల్‌: ఖిలా వరంగల్‌ కోటను ఆదివారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత తన కుటుంబ సభ్యులతో సందర్శించారు. ఈసందర్భంగా నాలుగు కీర్తితోరణాల్లోని అద్భుతమైన శిల్పకళా సంపదను ఆసక్తిగా తిలకించారు. ఆతర్వాత ఖుష్‌మాహల్‌, రాతి, మట్టికోట, ఏకశిలగుట్ట అందాలు వీక్షించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను గైడ్‌ దేనబోయిన రవియాదవ్‌ సీపీ శ్వేతకు వివరించారు. చరిత్రను కాపాడుకునే బాధ్యత మనపై ఉందని సీపీ శ్వేత పేర్కొన్నారు. కార్యక్రమంలో కో–ఆర్డినేటర్‌ శ్రీకాంత్‌, టీజీ టీడీసీ ఇన్‌చార్జ్‌ అజయ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement