విద్యారణ్యపురి: ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ అమలు చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని డీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్‌రెడ్డి, అధ్యాపక జ్వాల సంపాదకుడు డాక్టర్ ఎం గంగాధర్, జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, జిల్లా కమిటీ బాధ్యులు గోవర్ధన్, అల్లం మల్లయ్య, ఎస్.సుమ, ఎం.హర్షవర్ధన్‌రెడ్డి, చిన్నేశ్వరరావు పాల్గొన్నారు.


