పర్యాటక దినోత్సవానికి కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

పర్యాటక దినోత్సవానికి కార్యాచరణ

Sep 20 2026 1:27 AM | Updated on Sep 20 2026 1:27 AM

పర్యాటక దినోత్సవానికి కార్యాచరణ

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లో పర్యాటక, విద్యా, పురావస్తు, అటవీ తదితర శాఖల అధికారులతో ప్రపంచ పర్యాటక దినోత్సవ ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 24న ఉదయం 6 గంటలకు హనుమకొండ కలెక్టరేట్‌లో యోగా పోటీలతో ప్రారంభమై 27వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, అదనపు కలెక్టర్‌ రవి, జిల్లా అటవీ శాఖ అధికారి ముకుందరెడ్డి, డీఈఓ గిరిరాజ్‌గౌడ్‌, హనుమకొండ ఏసీపీ నరసింహరావు, అడిషనల్‌ డీఆర్డీఏ వెంకటేశ్వర్లు, జీడబ్ల్యూఎంసీ సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఇరిగేషన్‌ ఈఈ మంగిలాల్‌, డీఐఈఓ గోపాల్‌, కేంద్ర పురావస్తు అధికారి అజిత్‌కుమార్‌, ఏఎస్‌ఎస్‌ అధికారి శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.

పనులు త్వరగా పూర్తి చేయాలి

ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, మిషన్‌ భగీరథ, టీజీఐడీసీ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఇందులో ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ దేవిక చౌహాన్‌, మిషన్‌ భగీరథ ఇంట్రా ఈఈ గాయత్రి, పంచాయతీరాజ్‌ ఈఈ రాజగోపాల్‌రావు, డీఈలు శ్రీనివాసరావు, శిరీష, యుగంధర్‌, రామ్‌దేవ్‌, సాంకేతిక సలహాదారు నరేందర్‌రెడ్డి, టీజీఐడీసీ ఏఈ ఎండీ అజీజ్‌ఖాన్‌, పంచాయతీరాజ్‌ ఏఈలు, అధికారులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement