వెదురుతో పర్యావరణ పరిరక్షణ | - | Sakshi
Sakshi News home page

వెదురుతో పర్యావరణ పరిరక్షణ

Sep 19 2026 8:50 AM | Updated on Sep 19 2026 8:50 AM

వెదురుతో పర్యావరణ పరిరక్షణ

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆర్థ్ధికాభివృద్ధికి దోహదపడే విలువైన సహజ వనరుగా వెదురు నిలుస్తుందని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా వెదురుతో తయారు చేసిన వస్తువులను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎల్‌.కిశ్‌ర్‌కుమార్‌, వైవీ గణేశ్‌, బీసీ సంక్షేమాధికారి పుష్పలత, జెడ్పీ సీఈఓ వసంత, పశుసంవర్థక శాఖ అధికారి బాలాజీ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి..

జాతీయ డిజిటల్‌ పశుసంపద మిషన్‌ (నేషనల్‌ డిజిటల్‌ లైవ్‌స్టాక్‌ మిషన్‌) లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పథకాల అమలు, సాధించిన ప్రగతిని సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, జెడ్పీ సీఈఓ వసంత, డీపీఓ కల్పన, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి టి.బాలాజీ, వ్యవసాయశాఖాధికారి విజయభాస్కర్‌, విజయ డెయిరీ డీడీ ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రసూతి ఆస్పత్రి పరిశీలన

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఉర్సు కరీమాబాద్‌లోని సీకేఎం ప్రభుత్వ అనుబంధ ప్రసూతి ఆస్పత్రిని శుక్రవారం కలెక్టర్‌ సత్యశారద సందర్శించారు. ఆపరేషన్‌ థియేటర్‌లో పరికరాలు ఎలా ఉన్నాయి, ఆస్పత్రి భవనం పరిసరాలు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను కలెక్టర్‌ పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చేపడుతున్న ఏర్పాట్లు, ఆస్పత్రి పనితీరును సమీక్షించారు. అలాగే, కరీమాబాద్‌లోని డ్రగ్స్‌ స్టోర్‌ను కలెక్టర్‌ తనిఖీ చేశారు. కలెక్టర్‌ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.లక్ష్మీదేవి, ఇన్‌చార్జ్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ కె.సత్యజిత్‌రే, తహసీల్దార్‌ ఇక్బాల్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement