● ఫ్లెక్సీ దుకాణం నిర్వహిస్తున్న గణేష్‌యాదవ్
హన్మకొండ చౌరస్తా/నయీంనగర్: హనుమకొండలోని రాంనగర్‌కు చెందిన పెద్దబోయిన గణేష్‌యాదవ్(35) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. హనుమకొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్‌యాదవ్ స్థానిక నయీంనగర్‌లో మౌనిక యాడ్స్ పేరుతో ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణం నడుపుతున్నాడు. షాప్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రమ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, గణేష్‌యాదవ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు.


