సజావుగా ధాన్యం కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

సజావుగా ధాన్యం కొనుగోళ్లు

Sep 17 2026 2:20 AM | Updated on Sep 17 2026 2:20 AM

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: ఖరీఫ్‌ సీజన్‌ 2026 – 27కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించేందుకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) ఎల్‌.కిశోర్‌కుమార్‌తో క లిసి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్‌ బుధవారం సమీ క్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో మొత్తం 98,539 ఎకరాల్లో వరి సాగు చేసినటఉల ఆమెకు అధికారులు వివరించారు. సుమారు 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. కొనుగోళ్లకు జిల్లాలో 209 ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లు (పీపీసీ) ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) వైవీ.గణేష్‌, సివిల్‌ సప్‌లై డీఎం సంధ్యారాణి, డీసీఎస్‌ఓ కిష్టయ్య, డీఆర్డీఓ నాగపద్మజ, డీసీఓ నీరజ, ఆర్డీఓలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు.

ఉల్లాస్‌ పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలి

న్యూశాయంపేట: జిల్లాకు కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా ఉల్లాస్‌ పరీక్షలను విజయవంతంగా నిర్వహించి, నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 20న నిర్వహించనున్న పరీక్షలకు ఉల్లాస్‌ పోర్టల్‌లో నమోదైన ప్రతీ మహిళ హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత మండల స్థాయిలోని అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్లపై ఉందని గుర్తుచేశారు. సమావేశంలో డీఆర్డీఓ నాగ పద్మజ, డీఈఓ రంగయ్యనాయుడు, అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ రమేష్‌రెడ్డి, డీఎంసీ రేణుక, ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ సదానందం, ఉల్లాస్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

పర్యాటక దినోత్సవాన్ని

విజయవంతం చేయాలి

న్యూశాయంపేట: ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను ప్రజలకు పరిచయం చేసే కార్యక్రమాలను రూపొందించి సమన్వయంతో విజయవంతం చే యాలని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద సూచించా రు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన సమన్వయ క మిటీ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement