● వరంగల్ ఎంపీ కడియం కావ్య
హన్మకొండ కల్చరల్: మహాగణపతి నవరాత్రి మ హోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. రుద్రేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం నుంచి 23వ తేదీ బుధవారం వరకు జరుగనున్న ఉత్తిష్ట గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఆలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ కావ్య పాల్గొని ఆల య ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మలతో కలిసి ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మా ట్లాడుతూ వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి కేంద్ర పురావస్తుశాఖ అధికారులను, మంత్రులను ఒప్పించి నిధులు మంజూరయ్యేలా కృషి చేశానన్నారు. కాగా, బుధవారం మాసశివరాత్రిని పుస్కరించుకుని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం రుద్రేశ్వరస్వామి వారికి లఘన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి ఆలయ నాట్య మండపంలో రుద్రేశ్వరీరుద్రేశ్వరస్వామికి మాసకల్యాణోత్సవం నిర్వహించారు. దేవాలయ ఈఓ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.


