హసన్‌పర్తి: బంజారాల సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతీక తీజ్ అని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి అన్నారు. గోపాలపురంలోని బంజారా సేవాసమితి ఆధ్వర్యంలో బాలాజీనగర్‌లో నిర్వహిస్తున్న తీజ్ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల ఆచారాలు, పండుగలు ప్రత్యేకతను చాటుతాయన్నారు. సేవా లాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీని సత్కరించారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ వెంకన్న, పీఆర్టీయూ నాయకులు తిరుపతిరెడ్డి, ఈదునూరి రవీందర్‌రెడ్డి, పి.శ్రీహరి, మహేందర్, కామిడి సతీ శ్‌రెడ్డి, పరిపూర్ణచారి, బిల్లా రఘునాథ్, కృష్ణ, వెంకటేశ్వర్లు, సుధాకర్, సేవాలాల్ సంఘం అధ్యక్షుడు రామెల్ నాయక్, రాజారామ్ నాయక్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి


