జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి
చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: వరంగల్‌లోని చిన్నవడ్డేపల్లి చెరువు అభివృద్ధి పనులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ ఇంజనీర్లను ఆదేశించారు. శనివారం చిన్నవడ్డేపల్లి చెరువు పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనీఖీ చేశారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుచరణ్, బల్దియా ఈఈ సంతోశ్‌బాబు, ఎంహెచ్‌ఓ రాజేశ్, డీఈ ముజమ్మిల్ పాల్గొన్నారు.
పనుల్లో నిర్లక్ష్యం తగదు
వరంగల్ పోతన సర్కిల్ నుంచి హంటర్ రోడ్డు సర్కిల్ వరకు ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న రహదారి నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. రోడ్డును పరిశీలించి ఇంజనీర్లకు సూచనలిచ్చారు. మణిద్వీప గార్డెన్ వద్ద కల్వర్టుల నిర్మాణం, పెప్‌లైన్ ఏర్పాటు పూర్తయినందున మిగిలిన డ్రెయినేజీ నిర్మాణ పనులు త్వరగా ముగించాలన్నారు.


