భవిష్యత్‌ తరాలకు పర్యావరణాన్ని కాపాడుదాం | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ తరాలకు పర్యావరణాన్ని కాపాడుదాం

Jun 6 2026 12:53 AM | Updated on Jun 6 2026 12:53 AM

భవిష్యత్‌ తరాలకు పర్యావరణాన్ని కాపాడుదాం

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌ క్రైం : భవిష్యత్‌ తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షిద్దామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో కలిసి సీపీ పండ్ల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ అడవులు తగ్గడం.. వాహన, పారిశ్రామిక కాలుష్యం పెరగంతో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. దీనిని నివారించేందుకు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా రాబోయే తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు అంకిత్‌ కుమార్‌, దార కవిత, అదనపు డీసీపీలు రవి, సురేష్‌ కుమార్‌, శ్రీనివాస్‌, ఏసీపీలు నర్సింహారావు, నాగయ్య, అంతయ్య, సురేంద్ర, ఆర్‌ఐలు సతీష్‌, శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌, శ్రీధర్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement