వడ్రంగి.. నక్క కథ | - | Sakshi
Sakshi News home page

వడ్రంగి.. నక్క కథ

Jun 6 2026 12:53 AM | Updated on Jun 6 2026 12:53 AM

సైకిల్‌కూ నంబర్‌ ఉంది..

కాజీపేట: హాయ్‌ ఫ్రెండ్స్‌.. నాపేరు టి.హర్ష ఆదిత్య. నేను కాజీపేట నుంచి అమ్మమ్మ వాళ్ల ఊరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంద మండలం రొంపె డుకు వేసవి సెలవులకు వెళ్లాను. అక్కడ మా అమ్మమ్మ నాకు మా అన్నయ్యకు చాలా కథలు చెప్పింది. ఇందులో వడ్రంగి.. నక్క కథ నాకు బాగా నచ్చింది. ‘ఒకప్పుడు ఒక అడవిలో నక్క నివసించేది. ఒక రోజు నక్క వేటకుక్కల గుంపు నుంచి తప్పించుకోవడానికి పరుగెడుతోంది. ఆ సమయంలో ఒక వడ్రంగి చెట్లను కోస్తూ కనిపించాడు. నక్క అతని దగ్గరకు వెళ్లి స్వామీ దయచేసి నన్ను వేటకుక్కల నుంచి రక్షించండని కోరింది. వడ్రంగా తన ఇంటిని చూపించి అక్కడ దాక్కోమన్నాడు. నక్క వెంటనే ఇంట్లోకి వెళ్లి ఒక మూలలో దాక్కుంది. కొంతసేపటికి వేటకుక్కలు అక్కడకు చేరాయి. వాటిని నడిపిస్తున్న వేటగాడు వడ్రంగిని మీరు నక్కను చూశారా.. అని అడిగాడు. వడ్రంగి నోటితో లేదు అని చెప్పాడు. కానీ తన వేలితో ఇంటివైపు సూచించాడు. అయితే వేటగాడు వడ్రంగి సంకేతాన్ని గమనించలేదు. దీంతో వేట కుక్కలతో అడవిలోకి వెళ్లిపోయాడు. వేటగాడు, వేట కుక్కలు వెళ్లిపోయిన తర్వాత నక్క బయటకు వచ్చింది. వడ్రంగి.. నక్కను చూసి నీవు ధన్యవాదాలు చెప్పకుండా వెళ్తున్నావు.. నేను నిన్ను దాచాను కదా అంటాడు. దానికి నక్క సమాధానం ఇస్తూ మీ మాటలు నన్ను రక్షించాయి. కానీ మీ చేతులు నన్ను మోసం చేశాయి. మీరు నిజాయితీగా ఉంటే నేను మీకు ధన్యవాదాలు చేప్పే వాడిని అంటూ అడవిలోకి జారుకుంది.

నీతి: మన మాటలు, చర్యలు ఒకేలా ఉండాలి.

ఒకటి చెప్పి మరొకటి చేయడం నైతికం కాదు

ఈ చిత్రంలో కనిపిస్తున్న బాలుడు తన తండ్రి మోటార్‌ బైక్‌ నంబర్‌ను ఒక అట్టముక్కపై రాసి తన సైకిల్‌కు అమర్చుకున్నాడు. బండి, కార్లకే కాదు.. నా సైకిల్‌కూ నంబర్‌ ఉందంటూ తెగ మురిసిపోతున్నాడు మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తికి చెందిన గండి సతీష్‌ కుమారుడు అద్విత్‌.

– ఇనుగుర్తి

Advertisement
 
Advertisement
Advertisement