హాకీ అంటే ఎంతో ఇష్టం, మేజర్ ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో నాలుగేళ్లుగా నయీంనగర్ హాకీ క్లబ్‌లో శిక్షణ తీసుకుంటున్నా. గతేడాది జార్ఖండ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు నుంచి ఆడాను. భవిష్యత్‌లో మరింత సాధన చేసి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే లక్ష్యం.
– టిక్క అరవిందరాజు, గోపాలపురం
రాష్ట్రస్థాయిలో కాంస్య పతకం సాధించాం..
మూడేళ్లుగా హాకీలో శిక్షణ తీసుకుంటున్నా. జూనియర్స్ విభాగంలో ఇప్పటి వరకు మూడు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు నుంచి పాల్గొన్నా. ఒక్క టోర్నమెంట్‌లో జిల్లాకు కాంస్య పతకం రావడం సంతోషం. ఇక్కడ మెరుగైన వసతులు కల్పిస్తే మరిన్ని పతకాలు సాధిస్తాం.
– ప్రతీక్‌ధావన్, నయీంనగర్


