హైదరాబాద్‌లో హాకీ ఫీల్డ్ గ్రౌండ్స్ మూడుకు పైగా ఉన్నాయి. రెండో రాజధానిగా చెప్పుకుంటున్న వరంగల్ నగరంలో ఒక్క కోర్టు లేకపోవడం బాధాకరం. ఇటీవల హనుమకొండకు వచ్చిన అంతర్జాతీయ హాకీ కోచ్ మధుకరన్ తన వంతుగా సాయం చేస్తానన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు సైతం హాకీ క్రీడా సదుపాయాల కల్పనకు పాటుపడాలి.
– లేగల శివరామ్, సీనియర్ హాకీ క్రీడాకారుడు
నేర్చుకోవాలన్న తపన ఉంది..
హాకీ క్రీడలో శిక్షణ పొందాలన్న ఆకాంక్ష, పట్టుదల నగరంలో అనేక మంది పిల్లల్లో ఉంది. అయితే అందుకు తగిన సదుపాయాలు లేక నిరుత్సాహంతో వెనుకడుగు వేస్తున్నారు. అత్యాధునిక వసతులు కల్పిస్తే ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయి హాకీ క్రీడాకారులను తీర్చిదిద్దవచ్చు.
– ములకల సుజిత్, కోచ్, నయీంనగర్


