దుగ్గొండి: నాపేరు దీక్షిత్. నేను దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నాకు మొక్కలు, జంతువులు అంటే ఇష్టం. ఈ వేసవికాలంలో పక్షులు నీరు దొరకక చనిపోతూ ఉంటాయి. అందుకని వాటికోసం నేను ప్రతీ రోజు ఓ బేషన్(ీస్టీల్ బౌల్)లో నీళ్లు పెడుతూ ఉంటాను. కొన్ని తిండి గింజలు వేస్తాను. దాంతో ఆ పక్షులు వచ్చి గింజలు తిని, నీరు తాగి ఉత్సాహంగా ఎగిరిపోతుంటే ఆనందంగా ఉంటుంది. మీరు ప్రకృతిని, పక్షులను కాపాడుతారని ఆశిస్తున్నాను.
బేషన్‌లో పక్షులకు
నీరు పెడుతున్న దీక్షిత్


