విద్యారణ్యపురి: వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్‌ఏసీ) ఆర్జేడీగా పి.మదన్‌మోహన్ శుక్రవారం బాధ్యతులు స్వీకరించారు. హైదరాబాద్‌లోని సమగ్రశిక్షలో జాయింట్ డైరెక్టర్ –1గా విధులు నిర్వర్తిస్తున్న మదన్‌మోహన్‌ను ఎఫ్‌ఏసీ ఆర్జేడిగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్‌నికోలస్ ఉత్తర్వులు జారీచేయడంతో ఇన్‌చార్జ్ ఆర్జేడీగా ఉన్న రంగయ్యనాయుడు నుంచి బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీగా ఇటీవల హైదరాబాద్‌లోని విద్యాశాఖ ఆర్జేడీ విజయలక్ష్మిని బదిలీ చేశారు. కానీ ఆమె ధీర్ఘకాలిక సెలవులో ఉన్నందున బాధ్యతలు చేపట్టలేదు. ఇక్కడ ఆర్జేడీగా బాధ్యతలను నిర్వర్తించిన సత్యనారాయణరెడ్డి హైదరాబాద్‌కు బదిలీ అయిన విషయం తెలిసిందే. అయితే విజయలక్ష్మి సెలవు ముగించుకొని బాధ్యతలు చేపట్టేవరకు మదన్‌మోహన్ ఆర్జేడీగా కొనసాగుతారని నవీన్‌నికోలస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఎఫ్‌ఏసీ ఆర్జేడీగా బాధ్యతలు స్వీకరించిన మదన్‌మోహన్‌ను టీఎన్జీఓ ఫోరం స్కూల్ ఎడ్యూకేషన్ సెక్రటరీ ఎండీ ఫక్రుద్దీన్ అహ్మద్, ఉపాధ్యక్షుడు రాయిశెట్టి అశోక్ శుక్రవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ హనుమకొండ జిల్లా సెక్రటరీ రాజేశ్వర్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య
కాశిబుగ్గ: వరంగల్ నగరంలోని కాశిబుగ్గ పద్మానగర్‌లో నివాసముంటున్న హెడ్‌కానిస్టేబుల్ తోరెట్టి రామారావు (54) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 1990 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ రామారావు మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో కొంతకాలం పనిచేశారు. ఇటీవల సంగెం పీఎస్‌కు బదిలీ అయ్యారు. ఈక్రమంలో అనా రోగ్య కారణాలతో శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామారావుకు భార్య రజిత, ఇద్దరు కుమారులు వీనిత్‌రాజ్, సిద్దార్థ్‌రాజ్ ఉన్నారు. భార్య రజిత ఫిర్యాదు మేరకు ఇంతెజార్‌గంజ్ ఎస్సై సందీప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వడదెబ్బతో
చిరువ్యాపారి మృతి
కమలాపూర్: వడదెబ్బతో బోళ్లు విక్రయించే చిరువ్యాపారి శుక్రవారం మృతిచెందాడు. గ్రామస్తుల వివరా ల ప్రకారం.. మండలంలో ని కానిపర్తికి చెందిన పస్తం వినోద్ (31) గ్రామాల్లో తిరిగి బోళ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే వినోద్ గురువారం వ్యాపారం నిమిత్తం గ్రామాలు తిరుగుతూ వడదెబ్బకు గురయ్యాడు. రాత్రి ఇంటి వద్ద భోజ నం చేసి పడుకుని తెల్లారే సరికి మృతి చెందా డు. వినోద్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.


