బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వండి

Jun 6 2026 12:53 AM | Updated on Jun 6 2026 12:53 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: తెలంగాణలో రెండుసార్లు బీఆర్‌ఎస్‌కు, మరోసారి కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇచ్చారని ఈసారి జరగనున్న అంసెంబ్లీ ఎన్ని కల్లో బీజేపీకి ప్రజలు అధికారం అందిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన బీజేపీ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం రామచందర్‌రా వు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల పరి పాలనలో ప్రజలు, ఉద్యోగులు సంతోషంగా లేరన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వా గ్ధానాలను మరిచిపోయిందని ఆరోపించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతీ ఒక్కరు తల్లి పేరుతో మొక్కలు నాటాలన్నారు. ప్రధాని మోదీ 12 సంవత్సరాల పాలనలో రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌, చేవెళ్ల, కామారెడ్డిల డిక్లరేషన్లు ఏమయ్యాయన్నాని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం, మంత్రులు తలో మాటా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ శిక్షణ తరగతుల్లో జిల్లా అధ్యక్షుడు వల్లాభూ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శులు చీకటి మహేష్‌గౌడ్‌, గడ్డం అశోక్‌ కుమార్‌, మదన్‌లాల్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వద్దిరాజు రామచంద్రరావు, లింగాల సుధీర్‌రెడ్డి , శ్యామ్‌సుందర్‌శర్మ, గిరిజప మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్‌, ఉపాధ్యక్షుడు కల్యాణ్‌నాయక్‌, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాష్ట్ర నాయకులు ఎండ్ల అశోక్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వెంకన్న, నర్సిహరెడ్డి, సందీప్‌గౌడ్‌ పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఎన్‌.రామచందర్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement