హన్మకొండ: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ కోసం పోరాటం తప్పదని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327, తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. హనుమకొండ వడ్డెపల్లిలోని టీఎస్‌ఈఈయూ–327 కార్యాలయం పల్లా రవీందర్ రెడ్డి భవన్‌లో శుక్రవారం కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రామిక శక్తి అవార్డు అందుకున్న యూనియన్ వరంగల్ జిల్లా కార్యదర్శి మచ్చిక బుచ్చయ్య గౌడ్, ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి కె.శ్రీనివాస్, నాయకులు పి.మాధవ రావు, శ్రీనివాస్, ఎండీ అబ్దుల్ మజీద్, పి.రమేష్, కె.వెంకటేశ్వర్ రావు, తులసీ శ్రీమతి, బి.విజయభాస్కర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇనుగాల శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. త్వరలోనే బదిలీలు ఉంటాయన్నారు. అనంతరం టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ ఎస్‌ఈ ఎ.ఆనందం మాట్లాడారు. టీఎస్ ఈఈయూ–327 ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, డీఈలు మల్లికార్జున్, రాంబాబు, టీఎస్‌ఈఈయూ–327 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేష్, నాయకులు భూపాల్‌డ్డి, చిట్ల ఓదెలు, దొనికల సదయ్య, రవికుమార్ పాల్గొన్నారు.
టీఎస్ ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్


