● సికింద్రాబాద్ రైల్వే డీఆర్‌ఎం గోపాలకృష్ణన్
కాజీపేట రూరల్ : ప్లాస్టిక్ రహిత సమాజానికి అందరూ కృషి చేయాలని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) డాక్టర్ గోపాలకృష్ణన్ అన్నారు. శుక్రవారం ఆయన కాజీపేట జంక్షన్‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న అమృత్ భారత్ స్టేషన్ పనులను తనిఖీ చేశారు. అనంతరం ప్రపంచ పర్యావరణ ది నోత్సవాన్ని పురస్కరించుకుని రైల్వే కాలనీలోని ఇంజనీరింగ్ ట్రైనింగ్ సెంటర్‌లో మొక్కలు నాటారు. కాజీపేట రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై ప్లాస్టిక్ వాడరాదు.. మొక్కలు నాటి పర్యవరణాన్ని పరిరక్షించాలని శేఖర్ టీం ఆధ్వర్యంలో ప్రదర్శించిన వీధి నాటకాన్ని తిలకించారు. అనంతరం ప్రయాణికులకు జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో సికింద్రాబాద్, కాజీపేట రైల్వే అధికారులు హర్షసాయి, ప్రజంల్ కేశర్‌వాణి, సూర్యనారాయణ, వెంకటకుమార్, డాక్టర్ నరేందర్ హిర్వాని, అగ్గి రవీందర్ పాల్గొన్నారు.
కాజీపేట రైల్వే బస్టాండ్ స్థలంపై సమావేశం
కాజీపేట రైల్వే జంక్షన్‌లో బస్టాండ్ నిర్మాణానికి కావాల్సిన స్థలంపై శుక్రవారం డీఆర్‌ఎం గోపాలకృష్ణన్, హనుమకొండ ఆర్డీఓ వెంకటేష్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ భవానిప్రసాద్, డిప్యూటీ ఆర్‌ఎం భానుకిరణ్, హనుమకొండ డీఎం ధరమ్‌సింగ్‌లు సమావేశమయ్యారు. పలు విషయాలపై చర్చించారు. ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలోని రైల్వే స్థలాన్ని ఓకే చేసి ఆర్టీసి బస్టాండ్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.


