ఎస్‌ఎస్‌తాడ్వాయి: సహజసిద్ధమైన ప్రకృతి అందాలు, దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉన్న పోచాపూర్ ఊటీని తలపిస్తోందని త్వరలో ఈ అటవీ ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పోచాపూర్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఆమె మాట్లాడారు. పోచాపూర్ చుట్టూ విస్తరించి ఉన్న అడవులు, కొండలు, ప్రకృతి వైభవాన్ని చూసిన ప్రజాప్రతినిధులు, అధికారులు సంతోషం వ్యక్తం చేశారన్నారు. ఊటీని గుర్తు చేసే వాతావరణం పోచాపూర్ చుట్టూ ఉందని పేర్కొన్నారు. అటవీ సంపదకు ఎలాంటి నష్టం కలగకుండా ఎకో–టూరిజం తరహాలో అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఊటీ తరహా ప్రకృతి అందాలతో అలరారుతున్న పోచాపూర్ భవిష్యత్‌లో రాష్ట్ర పర్యాటక మ్యాప్‌పై ప్రత్యేక స్థానం సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయని మంత్రి సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర మంత్రి సీతక్క


