శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్‌ శ్రీ 2026

Jun 5 2026 10:09 AM | Updated on Jun 5 2026 10:09 AM

పరిమితికి మించి..

టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలో గృహ జ్యోతి పథకానికి 26,17,502 మంది నమోదు చేసుకోగా.. 24,63,206 మందికి జీరో బిల్లులు జారీ అయ్యాయి. 1,70,438 మంది 200కుపైగా యూనిట్లు వినియోగించడంతో జీరో బిల్లులు జారీ కాలేదు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మేనెలలో గృహజ్యోతి లబ్ధిదారులు 5,95,805 ఉండగా విద్యుత్‌ వినియోగం పెరగడంతో 5,42,026 జీరో బిల్లులు జారీ అయ్యాయి. ఇక్కడ 53,779 సర్వీస్‌లకు జీరో బిల్లులు జారీ కాలేదు. 200 యూనిట్ల పరిమితి దాటిన వినియోగదారులు బిల్లులు చెల్చించాల్సి వచ్చింది. కాగా, గృహజ్యోతి లబ్ధిదారులు 200 యూనిట్ల పరి మితిలో విద్యుత్‌ను వినియోగించి వాడకాన్ని నియంత్రిస్తేనే జీరో బిల్లు ప్రయోజనం పొందవచ్చని సూచి స్తున్నారు. 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడితే తిరిగి జీరో బిల్లులు జారీ అవుతాయని అధికారులు సూచిస్తున్నారు.

మేలో జిల్లాల వారీగా వివరాలు..

పెరిగిన విద్యుత్‌ వినియోగం.. తగ్గిన జీరో బిల్లులు

హన్మకొండ: భారీ ఉష్ణోగ్రతల కారణంగా గృహాల్లో విద్యుత్‌ వినియోగం పెరిగింది. మండుతున్న ఎండలకు వడగాలులు, ఉక్క పోత నుంచి ఉపశమనం పొందడానికి కూలర్లు, ఏసీల వినియోగం మునుపెన్నడూ లేని విధంగా గణనీయంగా పెరిగింది. ఈవేసవిలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌ దాటడంతో భరించలేని వేడి పెరిగింది. ఫ్యాన్లు వాడినప్పటికీ వేడి తగ్గకపోవడంతో కూలర్లు, ఏసీలు వినియోగించారు. విద్యుత్‌ వినియోగం పెరగడంతో మీటర్లు గిర్రున తిరిగాయి. యూనిట్లపై యూనిట్లు నమోదయ్యాయి. ప్రతీ నెల 200 యూనిట్లలోపు నమోదయ్యే యూనిట్లు ఆపైన రికార్డు అయ్యాయి. దీంతో జీరో బిల్లులు తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడే గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. ఉచిత విద్యుత్‌ బిల్లులో భాగంగా.. 200 యూనిట్లలోపు నమోదయ్యే సర్వీస్‌లకు జీరో బిల్లులు జారీ చేస్తున్నారు. ప్రస్తుత వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్‌ ఉపకరణాలైన కూలర్లు, ఏసీల వినియోగం పెరిగింది. దీంతో 200 యూనిట్లు దాటడంతో జీరో బిల్లులు తగ్గాయి.

46,165

42,836

97,660

92,626

1,39,356

1,20,880

1,14,187

1,06,996

60,616

56,097

1,37,821

1,22,591

మహబూబాబాద్‌

వరంగల్‌

ములుగు

భూపాలపల్లి

హనుమకొండ

జనగామ

గృహజ్యోతి

వినియోగదారులు

జారీ అయిన జీరో బిల్లులు

Advertisement
 
Advertisement
Advertisement