పర్యావరణంపై ఆ‘మంచి’ కుంచె | - | Sakshi
Sakshi News home page

పర్యావరణంపై ఆ‘మంచి’ కుంచె

Jun 5 2026 10:09 AM | Updated on Jun 5 2026 10:09 AM

ఆకుల హరివిల్లు..

సూర్యుడే దుఃఖ

పడుతున్నాడు..

సూర్యుడు తన చేతిలో విసనకర్రతో అత్యధిక వేడిమిని భరించలేక తనకు తానే విసురుకుంటున్నాడు. చెట్ల నరకడం వల్ల భూమి వేడెక్కి ఓజోన్‌ పొర దెబ్బతిని సూర్యుని వేడి నేరుగా భూమిని తాకుతుంది. సూర్యుడు నవ్వాలంటే మొక్కలను పెంచాలని చెప్పడానికి ఈ చిత్రం గీశాడు.

నేడు వర్సెస్‌ రేపు..

అభివృద్ధి పేరుతో అడవులు నరకబడుతున్నాయి. దీంతో రేపు ఆక్సిజన్‌ కోసం మొక్కను మోయాల్సి వస్తుంది. నేడు ఉచితంగా లభించే ఆక్సిజన్‌ను రేపు కొనుక్కోవాల్సి వస్తుందని చెప్పడానికి ఈ చిత్రం గీశాడు.

భూమాత.. చెట్లు, నదులు, జంతువులు, పక్షులతో నిండి ఆరోగ్యంగా ఉంది. ఆమె చేతిలో ఆకులు, పూలు, వేర్లతో చేసిన విల్లు ఉంది. రాక్షసుడి రూపంలో ఉన్న కాలుష్యం విల్లు దెబ్బకు పారిపోతుందని తెలిసేలా ఈ చిత్రం గీశాడు.

దుగ్గొండి: ఆధునిక పోకడలు శరవేగంగా ముందుకు సాగుతున్న తరుణంలో అభివృద్ధి పేరుతో చెట్లు అంతరించి పోతున్నాయి. వాహనాలు, పరిశ్రమల పొగతో కాలుష్యం పెరిగిపోతోంది. కార్బన్‌డైయాకై ్సడ్‌ పెరిగి ఆక్సిజన్‌ తగ్గిపోతోంది. సూర్యుడి తాపం పెరిగి సరిగా వర్షాలు కురువని పరిస్థితి నెలకొంటోంది. దీంతో భవిష్యత్‌ తరం లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణపై వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండల ప్రశాంతి మండల సమాఖ్య కార్యాలయంలో కమ్యూనిటీ సర్వేయర్‌ ఆమంచ రవి పలు కార్టూన్‌లు గీసి అవగాహన కల్పిస్తున్నాడు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలను చైతన్య వంతం చేసేందుకు రవి గీసిన చిత్రాలు ఇలా ఉన్నాయి.

నరికితే నష్టం..

నాటితే లాభం.

నేడు చెట్లను విచక్షణారహితంగా నరకడం వల్ల రేపు ఆక్సిజన్‌ సిలిండర్‌ను వీపున మోస్తూ మాస్కు పెట్టుకుని భవిష్యత్‌ వైపు చూడాల్సి వస్తుంది. దీనిని వర్ణిస్తూ ఈ చిత్రం గీశాడు.

ప్రకృతి పరిక్షణకు వినూత్న

కార్టూన్‌లు గీసి అవగాహన

కల్పిస్తున్న రవి

ప్రశంసిస్తున్న పర్యావరణవేత్తలు

నేడు ప్రపంచ పర్యావరణ

దినోత్సవం

Advertisement
 
Advertisement
Advertisement