ఎంఏ తెలుగు కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఎంఏ తెలుగు కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

Jun 5 2026 10:09 AM | Updated on Jun 5 2026 10:09 AM

హన్మకొండ కల్చరల్‌ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో ఎంఏ తెలుగు కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైందని జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా వరంగల్‌ ప్రాంగణంలోని జానపద గిరిజన విజ్ఞానపీఠంలో 2026–2027 విద్యా సంవత్సరానికిగాను ఎంఏ తెలుగు కోర్సులో ప్రవేశం పొందడానికి ఆసక్తిగల అభ్యర్థులు తెలుగు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ teluguuniversity.ac.in,www.pstucet.orgలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను 2026 జూన్‌ 24లోగా సాధారణ రుసుముతో, 2026 జూన్‌ 30వరకు ఆలస్యరుసుముతో సమర్పించాలన్నారు. వివరాలకు 9989417299, 9989139136, 7989385451 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

నేటినుంచి హాస్టళ్లు, మెస్‌ల రీఓపెన్‌

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలోని పలు హాస్టళ్లు, కామన్‌మెస్‌, మహిళా హాస్టల్‌తోపాటు మెస్‌, ‘లా’ హాస్టల్‌తోపాటు మెస్‌ను ఈనెల 5వతేదీ నుంచి రీఓపెన్‌ చేయబోతున్నామని హాస్టళ్ల డైరెక్టర్‌ పి. శ్రీనివాస్‌ గురువారం తెలిపారు. పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 8నుంచి జరగనున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి హాస్టళ్లు, మెస్‌లను రీఓపెన్‌ చేస్తున్నామన్నారు. పీజీ కోర్సుల రెండో సెమిస్టర్‌ విద్యార్థులకు ఈనెల 9 నుంచి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అదేరోజు నుంచి హాస్టల్‌, మెస్‌ సదుపాయం కల్పిస్తామని ఆయన తెలిపారు.

బెటాలియన్‌ను

సందర్శించిన ట్రైనీ ఐపీఎస్‌లు

మామూనూరు : తెలంగాణకు కేటాయించిన 2024 బ్యాచ్‌కు చెందిన నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లు అయేషా ఫాతిమా, సోహమ్‌ సునీల్‌, మనీషా నెహ్రా, రాహుల్‌ కాంత్‌ ప్రాక్టికల్‌ శిక్షణ నిమిత్తం గురువారం మామూనూరులోని టీజీఎస్పీ 4వ బెటాలియన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా బెటాలియన్ల నిర్మాణం, కమాండ్‌ కంట్రోల్‌, శిక్షణ, వసతి, సంక్షేమం, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాల పనితీరు పరిశీలించి అవగాహన పెంచుకున్నారు. అడ్మినిస్ట్రేటివ్‌ గురించి బెటాలియన్‌ కమాండెంట్‌ డి.శివప్రసాద్‌ రెడ్డి వివరించారు. అసిస్టెంట్‌ కమాండెంట్‌ జె.రాజేందర్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

వడదెబ్బతో యువకుడి మృతి

కాజీపేట : కాజీపేట మండలం సోమిడికి చెందిన నాగపూరి మురళీధర్‌ గౌడ్‌ (35) వడదెబ్బతో మృతి చెందాడు. బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మురళీధర్‌ గౌడ్‌ రాత్రి ఇంటికి చేరుకున్న అనంతరం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్ల వారుజామున మృతి చెందాడు.

దేవరుప్పులలో వృద్ధుడు..

పాలకుర్తి టౌన్‌(దేవరుప్పుల): దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన కొత్త శ్రీనివాస్‌రెడ్డి(70) వడదెబ్బతో గురువారం మృతి చెందాడు. శ్రీనివాస్‌రెడ్డి రేకుల ఇంట్లో రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement