కేయూలో ఈ–ఆఫీస్‌ విధానం అమలు | - | Sakshi
Sakshi News home page

కేయూలో ఈ–ఆఫీస్‌ విధానం అమలు

Jun 4 2026 7:15 AM | Updated on Jun 4 2026 7:15 AM

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలో ఈ– ఆఫీస్‌ విధానం అమలుకు ఉపక్రమించారు. యూ నివర్సిటీలోని వివిధ విభాగాల నుంచి వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయం వరకు అన్ని ఫైళ్లు, పత్రాలు పరిపాలన వ్యవహారాలను ఈ–ఆఫీస్‌ద్వారా నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య వి. రామచంద్రం బుధవారం వెల్లడించారు. తొలిసారిగా ప్రయోగాత్మకంగా పరిపాలనాభవనం టీచింగ్‌, నాన్‌టీ చింగ్‌విభాగ నుంచి ఒక ఫైల్‌ను ఈ –ఆఫీ స్‌ విధానం ద్వారా పరిశీలించి వీసీ ప్రతాప్‌రెడ్డి ప్రా రంభించి ఆమోదించారు. డిప్యూటీ రిజిస్ట్రార్‌, విశ్వవిద్యాలయం ఈ –ఆఫీస్‌ నోడల్‌ ఆఫీసర్‌గా పంజా ల శ్రీధర్‌ ఈ విధానంలో ఫైళ్ల కదలిక, వివిధ దశల కు సంబంధించిన అంశాలను వీసీ,రిజిస్ట్రార్లకు తె లిపారు. ఈ –ఆఫీస్‌ విధానాన్ని క్రమక్రమంగా అన్ని విభాగాలకు విస్తరించనున్నారు. ఈ –ఆఫీస్‌ అసిస్టెంట్‌ నోడల్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌తోపాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement