న్యూశాయంపేట: ఎన్‌హెచ్–163 (జి) భూసేకరణలో భాగంగా భూములు కోల్పోయిన గీసుకొండ మండలం మచ్చాపూర్ రైతులతో బుధవారం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆర్బిట్రేషన్ నిర్వహించారు. రైతుల అభ్యంతరాలు, పరిహారం తదితరల అంశాలపై కలెక్టర్ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, గీసుకొండ తహసీల్దార్ రియాజుద్దీన్, అధికారులు పాల్గొన్నారు.


