బిలాస్‌పూర్‌– యెలహంక మధ్య ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

బిలాస్‌పూర్‌– యెలహంక మధ్య ప్రత్యేక రైళ్లు

Jun 4 2026 7:15 AM | Updated on Jun 4 2026 7:15 AM

కాజీపేట రూరల్‌ : వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట జంక్షన్‌ మీదుగా బిలాస్‌పూర్‌– యెలహంక మధ్య అప్‌ అండ్‌ డౌన్‌లో 10 ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ బుధవారం తెలిపారు.

ప్రత్యేక రైళ్ల వివరాలు..

ఈ నెల 3 నుంచి జూలై 1వ తేదీ వరకు 5 సర్వీ స్‌లుగా బిలాస్‌పూర్‌–యెలహంక (08261) ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట జంక్షన్‌ చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా ఈ నెల 4 నుంచి జూలై 2వ తేదీ వరకు 5 సర్వీ స్‌లుగా యెలహంక –బిలాస్‌పూర్‌ 908262) ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తుంది. ఈ రైళ్ల సర్వీస్‌లకు భాతప్రా, రాయ్‌పూర్‌, దుర్గ్‌, రంజన్‌గాం, డోంగ్రఘర్‌, గొండియా, వడ్సా, చాదాపోర్టు, బల్లార్షా, సిర్పూర్‌కాగజ్‌నగర్‌, మంచిర్యాల, కాజీ పేట, చర్లపల్లి, సికింద్రాబాద్‌, లింగంపల్లి, వికా రాబాద్‌, తాండూర్‌, యాద్గిరి, కృష్ణా, రాయచూర్‌, మంత్రాలయం రోడ్‌, గుంతకల్‌, గూటి, అనంతపురం, ధర్మవరం స్టేషన్‌లో హాల్టింగ్‌ కల్పించారు.

మాదిగ హక్కుల దండోరా నియోజకవర్గ ఇన్‌చార్జుల నియామకం

హన్మకొండ చౌరస్తా: మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్‌డీ) ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్‌ మాదిగ, గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణలు తెలిపారు. ఈ మేరకు ఆయా ఇన్‌చార్జులకు నియామకపత్రాలు అందజేశారు. రాము – పరకాల, వక్కల ప్రభాకర్‌ – స్టేషన్‌ ఘన్‌పూర్‌, కొమిరె యాకాస్వామి – డోర్నకల్‌, రాజు – వరంగల్‌ పశ్చిమ, గనిపాక మహేందర్‌ – జనగామ, మాచర్ల ప్రభాకర్‌ – పాలకుర్తి, కొట్టెపాక శ్రీనివాస్‌ – ములుగు, సదానందం –వరంగల్‌ తూర్పు, మేకల ఓంకార్‌ – భూపాలపల్లి ఇన్‌చార్జులుగా నియమితులైనట్లు వివరించారు. మాదిగ సమాజ సమస్యల పరిష్కారం కోసం గ్రామస్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు సునీల్‌ మాదిగ, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement