ఖిలా వరంగల్: మార్కెట్ అభివృద్ధితోపాటు రైతు సంక్షేమమే పాలకవర్గ ధ్యేయమని, రైతులకు మెరుగైన సేవలందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎర్ర ప్రియాంక అన్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 18 మందితో కూడిన పాలక వర్గాన్ని మంగళవారం రాత్రి ప్రభుత్వం ప్రకటించింది. చైర్‌పర్సన్‌గా ఎర్ర ప్రియాంక, వైస్ చైర్మన్‌గా బండి జనార్దన్, సభ్యులుగా గాదరబోయిన రాజు, కందుకూరి పూర్ణచందర్, చల్ల వాసుదేవ రెడ్డి, గొడుగు భిక్షపతి, బాదావత్ నర్సింహ నాయక్, ఆకుల రుద్రప్రసాద్, బొడ్డు ప్రదీప్ కుమార్, కత్తి సంపత్, మహమ్మద్ సాబీరా, అచ్చ నాగరాజు, దుగ్యాల గోపాల్ రావు, గజ్జెల శ్యామ్ సుందర్, హసన్‌పర్తి పీఏసీఎస్ చైర్మన్, డిస్ట్రిక్ మార్కెటింగ్ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వరంగల్, బల్దియా మేయర్‌తో కలిపి 18 మందితో నూతన పాలక వర్గం ఏర్పడింది. ఈ మేరకు వరంగల్ మార్కెట్ పరిపాలన భవనంలో బుధవారం చైర్ పర్సన్ ఎర్ర ప్రియాంక, వైస్ చైర్మన్ బండి జనార్దన్, డైరెక్టర్లు గజ్జెల శ్యామ్ సుందర్, దుగ్యాల గోపాల్‌రావు తదితరులు బాధ్యతలు స్వీకరించారు. నూతన కార్యవర్గాన్ని మార్కెట్ అధికారులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
వరంగల్ వ్యవసాయ మార్కెట్
చైర్‌పర్సన్ ప్రియాంక


