ఎన్‌సీసీతో విద్యార్థుల్లో క్రమశిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఎన్‌సీసీతో విద్యార్థుల్లో క్రమశిక్షణ

Jun 4 2026 7:15 AM | Updated on Jun 4 2026 7:15 AM

రామన్నపేట : ఎన్‌సీసీతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి పెంపొందుతాయని పదో తెలంగాణ బెటాలియన్‌ అడ్మినిస్ట్రేవ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ రవి సునారే అన్నారు. బుధవారం నగరంలోని ఎల్‌బీ కళాశాల ఆడిటోరియంలో వరంగల్‌ పదో తెలంగాణ బెటాలియన్‌ ఆర్మీ వింగ్‌ ఆధ్వర్యంలో ఎన్‌సీసీ –2026 ‘ బి సర్టిఫికెట్‌’ పూర్తి చేసిన ఉమ్మడి వరంగల్‌ ఎన్‌సీసీ కేడెట్లకు బెటాలియన్‌ కమాండింగ్‌ అధికారి కల్నల్‌ ఎస్‌ఎస్‌ రామదురై పర్యవేక్షణలో సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎన్‌సీసీ రెండు సంవత్సరాల కోర్స్‌ పూర్తి చేసి పాసై ‘ బి ’ సర్టిఫికెట్‌ పొందిన కేడెట్లకు ఆర్మీలో ప్రవేశించడానికి రాజమార్గమని తెలిపారు. కాగా, 355 మంది కేడెట్లు ఉత్తీర్ణత సాధించి సర్టిఫికెట్లు పొందినట్లు ఎల్‌బీ కళాశాల ప్రిన్సిపాల్‌ అరుణ డీఎహెచ్‌రావు తెలిపారు. కెప్టెన్‌ ముండ్రాతి సదానందం, నాయబ్‌ సుబేదారి అనిల్‌ జాదవ్‌, బెటాలియన్‌ హవల్దార్‌ మేజర్‌ బెటా గేరికరూ సందీప్‌, లెఫ్టినెంట్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, ట్రైనింగ్‌ విభాగం ఇన్‌చార్జ్‌ కుమారస్వామి, హవల్దార్లు విష్ణు, నిషాద్‌, నిక్లేష్‌, రాజేందర్‌, ఈశ్వర్‌ పాల్గొన్నారు.

లెఫ్టినెంట్‌ కల్నల్‌ రవి సునారే

Advertisement
 
Advertisement
Advertisement