వరంగల్ క్రైం: పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా మహోన్నత సేవా పతకం, ఉత్తమ సేవా పతకాలను అందుకున్న పోలీసు అధికారులను మంగళవారం సీపీ సన్‌ప్రీత్ సింగ్ అభినందించారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ మహోన్నత సేవ పతకాన్ని అందుకోగా, క్రైమ్ ఏసీపీ సదయ్య, ఎస్సై వేణుగోపాల్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేశ్ ఉత్తమ సేవా పతకాలను, ఎస్సై కనకచంద్రం, ఏఎస్సైలు జయదేవ్, పాపయ్య, చేరాలు, అర్జున్, శ్యాంసుందర్, హెడ్ కానిస్టేబుళ్లు అమీర్ పాషా, నర్సింగరావు, స్వర్ణ లత సేవా పతకాలు అందుకున్నారు.


