ఒక రోజు శ్రీరాముడు తన తమ్ముళ్లు, మిత్రులతో కలిసి సరయు నది తీరంలో ఆటలు ఆడాలని నిర్ణయించాడు. రెండు జట్లుగా విడిపోవాలని చెప్పగా, లక్ష్మణుడు అన్నకు ఎదురుగా ఉండలేనని నిరాకరించాడు. భరతుడు మాత్రం శ్రీరాముడి ఆజ్ఞను గౌరవించి ప్రత్యర్థి జట్టుకు నాయకత్వం వహించాడు. ఆటలో శ్రీరాముడు ఉద్దేశపూర్వకంగా భరతుడి జట్టును గెలిపించాడు. ఈ సంఘటన ద్వారా లక్ష్మణుడి అంచలంచెల భక్తి, భరతుడి విధేయత, అన్నదమ్ముల మధ్య ఉన్న అపార ప్రేమ, పరస్పర గౌరవం వెలుగు చూశాయి. ఈ లీలను చూసి దేవతలు కూడా ఆనందించారు.
–జనగామ


