ట్రిపుల్‌ ఐటీకి 135 మంది విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీకి 135 మంది విద్యార్థుల ఎంపిక

Jun 1 2026 1:20 AM | Updated on Jun 1 2026 1:20 AM

వేతనాల్లో కోత నిలిపివేయాలి

విద్యారణ్యపురి : బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌లో (ఆర్‌జీయూకేటీ ) 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన (బాసర అండ్‌ మహబూబ్‌నగర్‌) ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ ప్రవేశాల తొలివిడత జాబితాను సంబంధిత అధికా రులు మే 30న విడుదల చేశారు. ప్రభుత్వ పా ఠశాలల విద్యార్థులను 85 శాతం, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులను 15 శాతం మందిని ఎంపికచేశారు. టెన్త్‌ పూర్తిచేసిన విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌లో ప్రవేశాలు పొందబోతున్నారు. తొలివిడతలో 1 ,691మంది ఎంపిక చేయగా అందులో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి 135 మంది ఎంపికయ్యారు. హనుమకొండ జిల్లా నుంచి 17 మంది, వరంగల్‌ ముగ్గురు, ములుగు 11మంది, జయశంకర్‌భూపాలపల్లి 14 మంది, జనగామ 21 మంది , మహబూబాబాద్‌ జిల్లా నుంచి 69 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈనెల 5,6,8 తేదీల్లో బాసర(నిర్మల్‌) క్యాంపస్‌లో నిర్వహించబోతున్నారు. ఎంపికై న ఆయా విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను ఆ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ హెచ్‌టీటీపీఎస్‌://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఆర్‌జీయూకేటీ.ఏసీ.ఇన్‌/అడ్మిషన్స్‌2026 హెచ్‌టీఎంఎల్‌లో చూసుకోవాల్సి ఉంటుంది.

కేయూ ఫార్మసీ కాలేజీలకు సెలవులు పొడిగింపు

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఫార్మసీ కాలేజీలకు సెలవులు పొడిగించారు. ఈ మేరకు ఆదివారం రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం సర్క్యూలర్‌ జారీ చేశారు. ఫార్మసీ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులకు 31తో వేసవి సెలవులు ముగిశాయి. జూన్‌1నుంచి రీఓపెన్‌ చేయాల్సిండగా జూన్‌ 7వతేదీ వరకు పొడిగిస్తూ రిజిస్ట్రార్‌ సర్క్యూలర్‌ జారీచేశారు. జూన్‌ 8 నుంచి పునఃప్రారంభించాలని రిజిస్ట్రార్‌ పేర్కొన్నారు.

పాఠశాల విద్యాశాఖ

ఆర్‌జేడీగా విజయలక్ష్మి

విద్యారణ్యపురి: హైదరా బాద్‌లో పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ (రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇ.విజయలక్ష్మి వరంగల్‌ పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీగా బదిలీ అయ్యారు. ఈమేరకు సంబంధి త ఉన్నతాధికారులు గతనెల 30న ఉత్తర్వులు జారీచేశారు. వరంగల్‌లో పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సత్యనారా యణరెడ్డికి హైదరాబాద్‌లో మోడల్‌ స్కూల్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌గా, ఎఫ్‌ఏసీ అడిషనల్‌ డైరెక్టర్‌గా పోస్టింగ్‌ ఇస్తూ బదిలీ చేశారు.

విద్యారణ్యపురి: ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల వేతనాల నుంచి ఈహెచ్‌ఎస్‌ చందా పేరుతో కోత విధించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం హనుమకొండలోని పీఆర్‌టీయూ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈహెచ్‌ఎస్‌ చందా విషయంలో డీడీఓలకు గాని ఉద్యోగులకు ఎలాంటి విధివిధానాలను తెలియజేయకుండానే ఎలా వేతనం నుంచి 1.5 శాతం కోత విధిస్తారని ప్రశ్నించారు.రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇప్పటికై నా పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అసోసియేషన్‌ రాష్ట్ర కోకన్వీనర్‌ ధర్మేంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడు మేకరి దామోదర్‌, కార్యదర్శులు సూర కు మారస్వామి, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement