బుడతలు.. కరాటేలో మెరికలు! | - | Sakshi
Sakshi News home page

బుడతలు.. కరాటేలో మెరికలు!

Jun 1 2026 1:20 AM | Updated on Jun 1 2026 1:20 AM

పతకాల బాటలో..

మూడేళ్లు కరాటేలో తర్ఫీదు పొందుతున్నా. పలుచోట్ల జరిగిన జోనల్‌, జిల్లా స్థాయి పోటీల్లో 6 పతకాలు సాధించా. ఈ ఏడాది నగరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ విజయం సాధించా.

–జయశ్రీ, విద్యార్థిని, కాజీపేట

విజయంతోనే వస్తా..

మూడున్నర ఏళ్లుగా మార్షల్‌ ఆర్ట్స్‌లో కుమార్‌ మాస్టర్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నా. కాస్త కఠినమైనా ఇష్టపడి నేర్చుకుంటున్నా. పోటీలు ఎక్కడ జరిగిన విజయంతోనే వస్తా. అండర్‌–15లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నా. జనగామ, బెల్లంపల్లిల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పతకం దక్కింది.

–కొలిపాక కల్యాణి, విద్యార్థిని

కష్టమైన క్రీడలో ఇష్టంగా రాణిస్తున్న చిన్నారులు

ఓవైపు చదువు.. మరోవైపు విజయాల పరంపర

కాజీపేట : పిట్ట కొంచెం.. కూత ఘనం అన్న సామెతను నిజం చేస్తున్నారు కాజీపేట మండలానికి చెందిన పలువురు చిన్నారులు. కష్టమైన కరాటేలో ఇష్టంగా రాణిస్తున్నారు. ఆత్మ రక్షణతోపాటు శారీరక, మానసికోల్లాసాన్ని ఇచ్చే మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్నారు. మాస్టర్ల పర్యవేక్షణలో వయస్సు తారతమ్యం లేకుండా తర్ఫీదు పొందుతున్నారు. వేసవి సెలవులను ఉదయం, సాయంత్రం వేళలను చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు కరాటేలో చక్కటి విజయాలు సాధిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement