వడదెబ్బతో నలుగురి మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో నలుగురి మృతి

Jun 1 2026 1:20 AM | Updated on Jun 1 2026 1:20 AM

వరంగల్‌ జిల్లాలో

దుగ్గొండి/సంగెం: దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మామునూరి నారాయణ(50) ఆదివారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అలాగే, దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామానికి చెందిన రోజువారీ కూలీ పిట్టల రాజన్న( 60) దంచికొడుతున్న ఎండలకు శనివారం అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స తీసుకుంటుండగా అదే రోజు రాత్రి మృతి చెందాడు. అలాగే, సంగెం మండలం సోమ్లాతండాకు చెందిన గుగులోత్‌ రమేశ్‌ (42) గత నెల 26వ తేదీన వరిగడ్డి కట్టలు తీసుకుని రావడానికి కూలీకి వెళ్లాడు. ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురికావడంతో ఎంజీఎం తరలించి చికిత్స చేయిస్తుండగా ఆదివారం సాయంత్రం మృతి చెందాడు.

మహబూబాబాద్‌ జిల్లాలో..

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ మండలం నడివాడకు చెందిన బి.ఉప్పలయ్య (65) ఆదివారం తోటల కాపలాకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికొచ్చి అస్వస్థతకు గురై మృతిచెందాడు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వడదెబ్బతో ఆదివారం నలుగురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాలతోపాటు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement