కూరగాయల బడి.. | - | Sakshi
Sakshi News home page

కూరగాయల బడి..

Jun 1 2026 1:20 AM | Updated on Jun 1 2026 1:20 AM

బెండకాయ టమాట

బడికి వెళ్లాయి

బడిలోకి వంకాయ

వచ్చి చేరింది.

వంకాయకు చింతకాయ

నేస్తమయ్యింది

అది చూసి బీరకాయ

గంతులేసింది

సొరకాయకు ఇది చూసి

కోపమొచ్చింది

పక్కనున్న దొండకాయ

చెవిన వేసింది

ఇవి రెండూ వంకాయతో

గొడవపడ్డాయి

గొడవలో దొండకాయ

కింద పడ్డాది.

ఏడుస్తూ సొరకాయ అలిగి కూర్చుంది

మునక్కాడ గురువుగారు

వచ్చి చూసారు

పదపదమని తరగతికి

తీసుకెళ్లారు

అక్షరాలు చూపించి

నేర్వమన్నారు.

ఆలుగడ్డ చామగడ్డ

దోసకాయలు

చదువుకొని ఎదిగాయి

చూడండి.

అల్లరంత మాని మీరు

చదవమని

మునక్కాడ గురువుగారు

చెప్పి వెళ్లారు.

కూరగాయల బడిలోని

కూరలన్నీ

గురువుగారి మాట విని

చదువుకున్నాయి.

బాలగేయం

Advertisement
 
Advertisement
Advertisement