పూడికతీతతో భూగర్భ జలాల వృద్ధి | - | Sakshi
Sakshi News home page

పూడికతీతతో భూగర్భ జలాల వృద్ధి

May 30 2026 8:47 AM | Updated on May 30 2026 8:47 AM

హసన్‌పర్తి: పూడికతీతతో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కడియం కావ్య అన్నారు. సుమారు కోటి రూపాయల వ్యయంతో చేపడుతున్న 56వ డివిజన్‌ గోపాలపురం ఊర చెరువు పూడికతీత పనులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌తో కలిసి వరంగల్‌ ఎంపీ కడియం కావ్య శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ఏటా వర్షాకాలంలో గోపాలపురం ముంపునకు గురవుతోందని, అయితే ఈ వరద ముంపు సమస్యలను తగ్గించేందుకు పూడికతీత పనులు దోహదపడతాయన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు మాట్లాడుతూ.. గోపాలపురంలోని పలు కాలనీలు ముంపునకు గురవకుండా చెరువు వద్ద రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా ఊర చెరువును సుందరీకరించాలని స్థానికులు కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు రుద్రోజు మహేందర్‌నాఽథ్‌, పూర్ణచందర్‌, మర్రి ప్రభాకర్‌, భూక్య విజయ్‌, దూలం రాజు, అనిత తుపాకుల దశరథం తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ కడియం కావ్య

గోపాలపురం చెరువు పూడికతీత పనులు ప్రారంభం

Advertisement
 
Advertisement
Advertisement