కాశిబుగ్గ: ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ మండలం స్తంభంపల్లిలోని ఏవీఎస్ హైస్కూల్‌లో సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు తెలిపారు. ఈ మేరకు వరంగల్ ఓ సిటీలోని క్యాంపు కార్యాలయంలో రచయితల వర్క్‌షాపు వాల్‌పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కళాకారులకు కొదవ లేదని, ప్రతీ ఇంటిలో ఒక కళ ఉందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో కళాకారులకు ప్రాధాన్యం ఇస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి వెళ్లే విధంగా పాటలు, పల్లె సుద్దులు, వీధి నాటకాలు అవసరమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో నాయకులు గోపాల నవీన్‌రాజు, మీసాల ప్రకాశ్, టీపీసీసీ సాంస్కృతిక సేవా వరంగల్ జిల్లా అధ్యక్షుడు గడ్డం సుధాకర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు పోలెపాక రమేష్, జన్ను శివకృష్ణ, గీకూరు సాంబయ్య పాల్గొన్నారు.


