బిషప్‌ విజయపాల్‌రెడ్డికి అభినందనలు | - | Sakshi
Sakshi News home page

బిషప్‌ విజయపాల్‌రెడ్డికి అభినందనలు

May 29 2026 8:16 AM | Updated on May 29 2026 8:16 AM

బిషప్‌ విజయపాల్‌రెడ్డికి అభినందనలు

కాజీపేట రూరల్‌: ఇటీవల ఎన్నికై న వరంగల్‌ క్యాథలిక్‌ డయాసిస్‌ పీఠాధిపతి బిషప్‌ దుగ్గింపుడి విజయపాల్‌రెడ్డిని కాజీపేట ఫాతిమానగర్‌ బిషప్‌ హౌస్‌లో వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయనకు బొకే అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఫాదర్లు కొమ్మారెడ్డి జోసెఫ్‌రెడ్డి, గంగారపు అనుకిరణ్‌, నారాయణరెడ్డి, మాజీ కార్పొరేటర్‌ అబుబక్కర్‌, కాంగ్రెస్‌ నాయకులు సింగారపు రవిప్రసాద్‌, డాక్టర్‌ శ్రావణ్‌, ఏనుగుల రాంప్రసాద్‌, అమర్‌, అరూరి సాంబయ్య, మట్టెడ కుమార్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే నాయినిని కలిసిన ఆర్డీఓ వెంకటేష్‌

హన్మకొండ చౌరస్తా: హనుమకొండ ఆర్డీఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వెంకటేష్‌.. బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆర్డీఓకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement