అన్నివర్గాలు ఆనందంగా జీవించాలి | - | Sakshi
Sakshi News home page

అన్నివర్గాలు ఆనందంగా జీవించాలి

May 29 2026 8:16 AM | Updated on May 29 2026 8:16 AM

నయీంనగర్‌: బక్రీద్‌ పండుగ శాంతి, సౌభ్రాతృత్వం, త్యాగానికి ప్రతీక అని, సమాజంలోని అన్నివర్గాల ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా జీవించాలని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి ఆకాంక్షించారు. బక్రీద్‌ సందర్భంగా 6వ డివిజన్‌ ఈద్గా మైదానంలో ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతాలకతీతంగా ప్రజలు కలిసిమెలసి జీవించాలని ఆకాంక్షించారు. బక్రీద్‌ పర్వదినం సందర్భంగా ముస్లింలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఈద్గా కమిటీ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement