ముస్లింల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ముస్లింల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

May 29 2026 8:16 AM | Updated on May 29 2026 8:16 AM

కాశిబుగ్గ: ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా వరంగల్‌లోని ఎల్‌బీనగర్‌లో ఈద్గాలో గురువారం నిర్వహించిన ప్రార్థనలో మంత్రి సురేఖతో పాటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మైనార్టీలకు కల్పించిన రిజర్వేషన్ల ద్వారా ఎంతోమంది ముస్లింల జీవితాల్లో మార్పు వచ్చిందని గుర్తుచేశారు. ఎల్‌బీనగర్‌ ఈద్గాను మరింత అభివృద్ధి చేసి, ఖబ్రస్తాన్‌ కోసం భూమి కేటాయింపునకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈద్గా కమిటీ తరఫున కొండా దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్షుడు ఎండీ సాదిక్‌, కార్యదర్శి ఎండీ అబ్దుల్లా, డాక్టర్‌ షేక్‌ హుస్సేన్‌, ఎండీ సర్దార్‌ పాషా, ఎంఏ ఖాధర్‌, ఎండీ వాజీద్‌, మౌలానా అత్‌ఖర్‌ రహ్మాన్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

Advertisement
 
Advertisement
Advertisement